ఇటు తెలుగు, అటు తమిళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకెళుతోంది కయాదు లోహర్. గత ఏడాది ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి ఆమె నటించిన ‘డ్రాగన్’ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఆమెను క్రేజీ హీరోయిన్‌గా మార్చింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీ అయింది. ఈ ఏడాది ఇప్పటికే ఆమె నుంచి ‘ఫంకీ’తో పాటు ‘పల్లిచట్టంబి’ సినిమా రాగా, మరో ఏడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
ఇవికాక ఇటీవల మరో తమిళ సినిమా తన లిస్ట్‌లో యాడ్ అయింది. కర్ణన్, మామన్నన్, బైసన్ లాంటి చిత్రాలతో మెప్పించిన మారి సెల్వరాజ్ దీనికి దర్శకుడు. ‘మంజనాతి’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. కయాదు లోహర్‌తో పాటు ప్రియాంక అరుళ్ మోహన్ ఇందులో మరో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో నటించడం డ్రీమ్ కమ్ ట్రూ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కయాదు. మొత్తానికి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న ఆమె.. ఆగస్టులో నాని సినిమా ‘ది ప్యారడైజ్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది.
