ఆటో రంగంలో మారుతి సంచలనం.. దేశంలోనే ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు లాంచ్

ఆటో రంగంలో మారుతి సంచలనం.. దేశంలోనే ఫస్ట్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు లాంచ్
  • కొత్త వ్యాగన్ ఆర్ ..ఇథనాలే ఇంధనం

మారుతి సుజుకి దేశంలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వ్యాగన్ ఆర్​ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ఇథనాల్ కలిపిన పెట్రోల్​తో నడుస్తుంది. వినియోగదారులు 20 శాతం నుంచి 100 శాతం వరకు ఇథనాల్​ను వాడుకోవచ్చు. దీంట్లో 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇంజన్ పాడవకుండా ఉండేందుకు కారులో ప్రత్యేక  ఫ్యూయల్ ఇంజెక్టర్లు,  ఫ్యూయల్ పంపులు, కొత్త ఫ్యూయల్ లైన్లను అమర్చారు. ధర వివరాలను కంపెనీ వెల్లడించలేదు.