న్యూఢిల్లీ: వెనా ఎనర్జీ ఇండియాకు చెందిన ఆరు గిగావాట్ల పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియో కొనుగోలుకు ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ దాదాపు రూ. ఆరు వేల కోట్లు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఈ పోర్ట్‌ఫోలియోలో 1.2 గిగావాట్ల ప్రాజెక్టులు, 1.8 గిగావాట్ల చివరి దశలోని ప్రాజెక్టులు, మూడు గిగావాట్ల అభివృద్ధి దశలో ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి. వీటికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెక్), గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ (జీయూవీఎన్ఎల్) లాంటి ప్రముఖ సంస్థలతో దీర్ఘకాలిక విద్యుత్ సరఫరా ఒప్పందాలు ఉన్నాయి. ఐనాక్స్ జీఎఫ్ఎల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవాంష్ జైన్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడంలో ఈ కొనుగోలు ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు.
