సివిల్ ఇంజినీరింగ్ కుర్రోళ్లకు సువర్ణావకాశం : AEE ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

సివిల్ ఇంజినీరింగ్ కుర్రోళ్లకు సువర్ణావకాశం : AEE ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్​సీ) ట్రాన్స్​పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ జూన్ 6న ప్రారంభమై జులై 13న ముగుస్తుంది. 

పోస్టు పేరు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ (సివిల్). 

మొత్తం ఖాళీలు: 222.

విభాగాల వారీగా ఖాళీలు: మల్టీజోన్–1 (అన్ రిజర్వ్​డ్ 35, ఈడబ్ల్యూఎస్ 11, బీసీ–8, బీసీ–బీ–11, బీసీ–సీ 1, బీసీ–డీ 7, బీసీ–ఈ4, ఎస్సీ–I 1, ఎస్సీ-–II 10, ఎస్సీ-–-III 6, ఎస్టీ 11, స్పోర్ట్స్ 2, పీహెచ్ 5). మల్టీజోన్-–2 (అన్ రిజర్వ్​డ్ 34, ఈడబ్ల్యూఎస్ 10, బీసీ-8, బీసీ-బీ-11, బీసీ-సీ 1, బీసీ-డీ 8, బీసీ–ఈ-5, ఎస్సీ–-I 1, ఎస్సీ--II– 10, ఎస్సీ-–--III 5, ఎస్టీ 10, స్పోర్ట్స్ 2, పీహెచ్ 5.)

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్​లో బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్​లకు ఐదేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మన్, ఎన్​సీసీ అభ్యర్థులకు మూడేళ్లు  వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జూన్ 8.

అప్లికేషన్ ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.500.

ఎగ్జామినేషన్ ఫీజు: అభ్యర్థులు అందరూ రూ.120 చెల్లించాలి. 

లాస్ట్ డేట్: జులై 15.

రాత పరీక్ష: 2026, అక్టోబర్ (తాత్కాలికం). 

 మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.tgpsc.gov.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ / ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించే పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-–Iలో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 ప్రశ్నలు 150 మార్కులకు, పేపర్–-II సివిల్ ఇంజినీరింగ్ (డిగ్రీ లెవల్) నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులకు ఇస్తారు.  పేపర్–-I ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. పేపర్–-II కేవలం ఇంగ్లిష్ లో మాత్రమే ఉంటుంది.