ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు నుంచి నేనంటేనే నువ్వే కదా

ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు నుంచి నేనంటేనే నువ్వే కదా

వడ్డే నవీన్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘ట్రాన్స్‌‌‌‌ఫ‌‌‌‌ర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల దర్శకుడు. రాశిసింగ్ హీరోయిన్‌‌‌‌గా నటించింది. ఇటీవల టీజర్‌‌‌‌‌‌‌‌, ఫస్ట్ సాంగ్‌‌‌‌తో ఆకట్టుకున్న మేకర్స్‌‌‌‌.. తాజాగా ‘నువ్వే కదా’ అనే మరో పాటను విడుదల చేశారు. 

క‌‌‌‌ళ్యాణ్ నాయ‌‌‌‌క్ కంపోజ్ చేసిన ఈ పాటను పివిఎన్ఎస్ రోహిత్‌‌‌‌, హ‌‌‌‌రిణి ఇవ‌‌‌‌టూరి పాడారు. ‘‘నువ్వే కదా నువ్వే కదా నేనంటేనే నువ్వే కదా.. నాతో ఉంది నువ్వే కదా..  నువ్వే లేకపోతే నాకేం తోచదుగా..” అంటూ భాస్కరభట్ల లిరిక్స్ రాశారు. హీరో హీరోయిన్ మ‌‌‌‌ధ్య లవ్‌‌‌‌, రిలేషన్‌‌‌‌ను తెలియజేసేలా సాగిన ఈ పాటకు దినేష్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ కొరియోగ్రఫీ చేశారు. శిల్పా తులస్కర్, వివేక్ రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, దేవి ప్రసాద్ ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జూన్ 19న విడుదల కాబోతోంది.