యూత్‌‌‌‌ఫుల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో రామ్ నితిన్

యూత్‌‌‌‌ఫుల్‌‌‌‌ కంటెంట్‌‌‌‌తో రామ్ నితిన్

మ్యాడ్‌‌‌‌’ చిత్రంతో ఆకట్టుకున్న యువ హీరో రామ్ నితిన్.. మరో యూత్​ఫుల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నారా రోహిత్‌‌‌‌తో ‘సుందరకాండ’ తీసిన వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గురువారం రామ్ నితిన్‌‌‌‌ బర్త్ డే సందర్భంగా విషెస్‌‌‌‌ చెబుతూ స్పెషల్‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. పోస్టర్‌‌‌‌‌‌‌‌, అందులోని క్యాప్షన్స్‌‌‌‌ను బట్టి ఈ చిత్రం వినోదాత్మకంగా ఉండబోతోందని అర్థమవుతోంది.  

కాకినాడలోని ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌‌‌‌లో సాగే యూత్‌‌‌‌ఫుల్‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ అని మేకర్స్‌‌‌‌ తెలియజేశారు.  ‘లిటిల్ హార్ట్స్’ ఫేమ్ సింజిత్ యెర్రమల్లి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. వినీత్, సందీప్ కో ప్రొడ్యూసర్స్‌‌‌‌. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌‌‌‌డేట్స్‌‌‌‌ వెల్లడించనున్నారు.