జ్యోతిష్యం: జూన్ నెల మీనరాశి వారికి ఎలా ఉంటుంది..కెరీర్ విషయంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి..!

జ్యోతిష్యం:  జూన్ నెల మీనరాశి వారికి ఎలా ఉంటుంది..కెరీర్ విషయంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి..!


 

రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛస్థితిలో ఉండి మీనరాశిని వీక్షించడం వల్ల నెలంతా చాలావరకు వైభవంగా సాగిపోతుంది. ఏలిన్నాటి శని ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ప్రభావం వలన మీన రాశి వారికి  ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం..! 

జూన్​ నెల (2‌026)  గ్రహాల మార్పు వివరాలు .. 

  • జూన్​ 2:  గురుడు కర్కాటకరాశిలోకి 
  • జూన్​ 8:  కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు 
  • జూన్​ 13:  శుక్రుడు సింహరాశిలోకి
  • జూన్​ 15న:  సూర్యుడు మిథునరాశిలోకి
  • జూన్​ 21 :  కుజుడు వృషభ రాశిలోకి
  • జూన్​ 22:  కర్కాటకరాశిలోకి  బుధుడు
  • జూన్​ 29 :  కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు

ధన స్థానంలో ధనాధిపతి కుజుడి సంచారం వల్ల ఆదాయానికి లోటుండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో తరచూ టెన్షన్లు తప్పకపోవచ్చు. చెడు స్నేహాల వైపు, వ్యసనాల వైపు మనసు మొగ్గు చూపుతూ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. 

వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది. పిల్లలు పైకి రావడానికి, వారి నుంచి శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్య సిద్ధి, వ్యవహార జయం వంటివి అనుభవానికి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార భాగస్వాములతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది..

ALSO READ : జూన్ నెల కుంభరాశి వారికి ఎలా ఉంటుంది..

ఈనెల ( జూన్​ 2026)  ఎక్కువ భావోద్వేగాలతో నిండి ఉంటుంది. మాట్లాడే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి. కోపం అదుపులో ఉంచుకోవాలి. లౌక్యం ప్రదర్శించడం ఒక్కటే మేలైన మార్గం.గ్రహాల మార్పు  ఈ వారికి సమాజంలో మంచి గుర్తింపు కలుగుతుంది.గతంలో మిమ్ములను వ్యతిరేకించిన వారు మీ సహాయం కోరతారు. 

వ్యాపారస్తులకు  పాత పెట్టుబడులకు ఈ సమయంలో ఊహించని లాభాలు పొందుతారు.  ఆర్థిక సమస్యలు తగ్గడంతో చాలా ప్రశాంతంగా ఉంటారు. కెరీర్​ విషయంలో ఊహించని మార్పులు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.