జ్యోతిష్యం: జూన్ నెల కుంభరాశి వారికి ఎలా ఉంటుంది.. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి..!

జ్యోతిష్యం:  జూన్ నెల కుంభరాశి వారికి ఎలా ఉంటుంది.. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి..!



గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి.  కుంభ రాశి వారికి  జూన్ నెల జాతక ఫలం ఎలా ఉందో  ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . 

జూన్​ నెల (2‌026)  గ్రహాల మార్పు వివరాలు .. 

  • జూన్​ 2:  గురుడు కర్కాటకరాశిలోకి
  • జూన్​ 8:  కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు 
  • జూన్​ 13:  శుక్రుడు సింహరాశిలోకి
  • జూన్​ 15న:  సూర్యుడు మిథునరాశిలోకి
  • జూన్​ 21 :  కుజుడు వృషభ రాశిలోకి
  • జూన్​ 22:  కర్కాటకరాశిలోకి  బుధుడు
  • జూన్​ 29 :  కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు

కుంభరాశి వారికి గ్రహాల కదలికల ఆధారంగా జూన్​ నెలలో  వ్యక్తిగత జాతకంలోని గ్రహ బలాన్ని బట్టి ఈ ఫలితాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.శుభ గ్రహాల అనుకూలత బాగా తగ్గినందువల్ల ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగంలో శ్రమ బాగా పెరుగుతుంది. ఆదాయంతో సమానంగా ఖర్చులు వృద్ధి చెందుతాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు యథాతథంగా కొనసాగుతాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 

కుటుంబ జీవితంలో ఒకటి రెండు అతి కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. తప్పకుండా అనుకున్న పనులు నిదానంగా  పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా సాగిపోతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతాయి.

ALSO READ : జూన్ నెల మకరరాశి ఫలితాలు.. 

 తోబుట్టువులు, సమీప బంధువులు సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. దైవ సంబంధమైన వ్యవహారాల్లో పాలుపంచుకోవడం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రేమ భాగస్వామి మీద ఖర్చు పెరిగే అవకాశం ఉంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.