ఈ ఏడాది ( 2026) జ్యోతిష్య పరంగా చాలా కీలకం కానుంది. ఆరు గ్రహాలు వాటి స్థానాల మారడంతో అన్ని రాశులపై తీవ్ర ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరి మకర రాశి వారికి జూన్ నెల ఎలా ఉండబోతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
జూన్ నెల (2026) గ్రహాల మార్పు వివరాలు ..
జూన్ 2: గురుడు కర్కాటకరాశిలోకి
జూన్ 8: కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు
జూన్ 13: శుక్రుడు సింహరాశిలోకి
జూన్ 15న: సూర్యుడు మిథునరాశిలోకి
జూన్ 21 : కుజుడు వృషభ రాశిలోకి
జూన్ 22: కర్కాటకరాశిలోకి బుధుడు
జూన్ 29 : కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు
మకర రాశివారికి ఈ నెలంతా వైభవంగా సాగిపోతుంది. ఆర్థికంగా, కుటుంబపరంగా, సామాజికంగా శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి. గురు బలం పెరగడంతో పాటు శుక్ర, బుధ గ్రహాల అనుగ్రహం కూడా కలిగినందువల్ల ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో మాత్రం చిన్నాచితకా సమస్యలుంటాయి.
ముఖ్యమైన ఆర్థిక వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. క్రమంగా ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారసత్వ సంపద లభించే అవకాశం ఉంటుంది. గృహ, వాహన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది.
ALSO READ : జూన్ నెల వృశ్చిక రాశి ఫలితాలు.. తీసుకోవలసిన
విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. తరచూ మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. సహోద్యోగులు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. పిల్లలు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది.
కుటుంబ సంబంధాలు బాగా పెరుగుతాయి. చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్న వారు తమకు నచ్చిన కంపెనీలో ఉద్యోగం పొందే అవకాశముంది. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే వారి కలలు కూడా నెరవేరుతాయి. పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ వస్తుంది. వ్యాపారస్థులు పాత సమస్యల నుంచి సమర్థవంతమైన మార్గాన్ని కనుగొంటారు. మీ భాగస్వామితో మీ సంబంధం చాలా బాగుంటుంది. విహార యాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
