జ్యోతిష్యం : జూన్ నెల వృశ్చిక రాశి ఫలితాలు.. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

జ్యోతిష్యం : జూన్ నెల వృశ్చిక రాశి ఫలితాలు..  తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే..!

జూన్​ నెలలో గ్రహాల మార్పు వలన రాశ్యధిపతి కుజుడు స్వస్థానంలో బాగా అనుకూలంగా ఉండడంతో పాటు, భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. పట్టిందల్లా బంగారమవుతుంది. చిన్నాచితకా సమస్యలున్నా మొత్తానికి నెలంతా సానుకూలంగానే సాగిపోతుంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు.  ఖర్చులు పెరిగే అవకాశం ఉంది..

జూన్​ నెల (2‌026)  గ్రహాల మార్పు వివరాలు .. 

  • జూన్​ 2:  గురుడు కర్కాటకరాశిలోకి
  • జూన్​ 8:  కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు 
  • జూన్​ 13:  శుక్రుడు సింహరాశిలోకి
  • జూన్​ 15న:  సూర్యుడు మిథునరాశిలోకి
  • జూన్​ 21 :  కుజుడు వృషభ రాశిలోకి
  • జూన్​ 22:  కర్కాటకరాశిలోకి  బుధుడు
  • జూన్​ 29 :  కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు

ఈ రాశి వారికి  జూన్​ నెల వ్యాపారం పరంగా  అనుకూల సమయం. వ్యాపారం సజావుగా సాగుతుంది. లాభాలు గడిస్తారు. అయితే.. వ్యక్తిగత జీవితం అంత సజావుగా సాగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. గ్రహాల   మార్పు కారణంగా, ఈ రాశికి చెందిన వ్యక్తులు మతపరమైన కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఖర్చులపై నియంత్రణ అవసరం. కష్ట సమయాల్లో మీరు మీ కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.

వృత్తి, ఉద్యోగాలలో స్థిరత్వం లభించడం, ప్రాభవం పెరగడం, గుర్తింపు రావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి, ఉద్యోగం మారడానికి అవకాశాలు బాగా మెరుగ్గా ఉన్నాయి. వ్యాపారాలు కూడా లాభాలపరంగా నిలకడగా పురోగమిస్తాయి. 

►ALSO READ | జ్యోతిష్యం.. గురుడు, శుక్రుడు సహా ఆరు గ్రహాలు మార్పు..జూన్ నెల తులారాశి వారికి ఎలా ఉంటుందంటే..!

వృత్తి జీవితంలో క్షణం తీరిక ఉండని పరిస్థితి ఉంటుంది. ప్రతి చిన్న విషయానికీ మానసికంగా ఆందోళన చెందడం మంచిది కాదు. పంచమ స్థానంలో ఉన్న శని వల్ల ఒత్తిడి, వ్యయ ప్రయాసలుంటాయి. స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.