జ్యోతిష్యం.. గురుడు, శుక్రుడు సహా ఆరు గ్రహాలు మార్పు..జూన్ నెల తులారాశి వారికి ఎలా ఉంటుందంటే..!

 జ్యోతిష్యం.. గురుడు, శుక్రుడు సహా ఆరు గ్రహాలు మార్పు..జూన్ నెల  తులారాశి వారికి ఎలా ఉంటుందంటే..!

జ్యోతిష్యశాస్త్రంలో  గురుడు.. శుక్రుడు.. గురు గ్రహం, సూర్యుడు.. ఇంకా చాలా శక్తివంతమైన గ్రహాలున్నాయి.  వీటితో మరో మూడు గ్రహాలు జూన్​ నెలలో  వాటి రాశులను మారనున్నాయి. ఆ సమయంలో అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జూన్​ ఆరు గ్రహాల మార్పు వలన తులారాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో ఈస్టోరీలో తెలుసుకుందాం. . .! 

జూన్​ నెల (2‌026)  గ్రహాల మార్పు వివరాలు .. 

  • జూన్​ 2:  గురుడు కర్కాటకరాశిలోకి
  • జూన్​ 8:  కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు 
  • జూన్​ 13:  శుక్రుడు సింహరాశిలోకి
  • జూన్​ 15న:  సూర్యుడు మిథునరాశిలోకి
  • జూన్​ 21 :  కుజుడు వృషభ రాశిలోకి
  • జూన్​ 22:  కర్కాటకరాశిలోకి  బుధుడు
  • జూన్​ 29 :  కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు

గ్రహాల స్థాన చలనం వలన జూన్​ 2026 నెలంతా తులారాశి వారికి  సానుకూలంగా గడిచిపోతుంది. ఈ రాశికి దశమ స్థానంలో సంచారం చేస్తున్న గురువు, భాగ్య, దశమ స్థానాల్లో సంచారం చేస్తున్న శుక్ర, బుధుల వల్ల అనేక విధాలుగా గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ఏ పని చేసినా చెల్లుబాటవుతుంది. ఈ రాశివారికి రాజపూజ్యాలు కలుగు తాయి. రాజ యోగాలు పడతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

 వృత్తి, ఉద్యోగాల్లో ఈ రాశివారి మాట చెల్లుబాటు కావడం, వీరి సలహాలు, సూచనలతో పాటు, వీరి పనితీరు కూడా అధికారులకు నచ్చడం వంటివి జరుగు తాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం, ఇతరులకు సహాయం చేయడం వంటివి చోటుచేసుకుంటాయి. వ్యాపారాల్లో భాగస్వాములతో వృత్తి, ఉద్యోగాల్లో సహచరులతో కొద్దిగా సమస్యలుండే అవకాశం ఉంది.

►ALSO READ | జ్యోతిష్యం: ఆరు శక్తివంతమైన గ్రహాల కదలికలో భారీ మార్పులు.. కన్యారాశి వారి అదృష్టం ఎలా ఉండబోతుంది..!

 ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.