జ్యోతిష్యం: ఆరు శక్తివంతమైన గ్రహాల కదలికలో భారీ మార్పులు.. కన్యారాశి వారి అదృష్టం ఎలా ఉండబోతుంది..!

జ్యోతిష్యం:  ఆరు శక్తివంతమైన గ్రహాల కదలికలో భారీ మార్పులు.. కన్యారాశి వారి అదృష్టం ఎలా ఉండబోతుంది..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జూన్ నెల అత్యంత కీలకమైన మార్పులకు వేదిక కాబోతోంది. ఈ నెలలో ప్రధాన గ్రహాలన్నీ తమ రాశులను మారుస్తూ సరికొత్త సమీకరణాలకు తెరలేపుతున్నాయి. జూన్ 2వ తేదీన దేవగురువు గురుడు  మిథున రాశి నుంచి తన ఉచ్చ స్థితి అయిన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అదే సమయంలో కుజుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఇంకా కొన్ని కీలక గ్రహాలు కూడా వాటి స్థానాలు మారనున్నాయి.  వీటి ప్రభావం వలన కన్యారాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

జూన్​ నెల (2‌026)  గ్రహాల మార్పు వివరాలు .. 

  • జూన్​ 2:  గురుడు కర్కాటకరాశిలోకి
  • జూన్​ 8:  కర్కాటకరాశిలో శుక్రుడు.. గురుడు 
  • జూన్​ 13:  శుక్రుడు సింహరాశిలోకి
  • జూన్​ 15న:  సూర్యుడు మిథునరాశిలోకి
  • జూన్​ 21 :  కుజుడు వృషభ రాశిలోకి
  • జూన్​ 22:  కర్కాటకరాశిలోకి  బుధుడు
  • జూన్​ 29 :  కర్కాటక రాశిలో వక్రగతిలో బుధుడు


భాగ్య స్థానంలో సంచరిస్తున్న రాశ్యధిపతి బుధుడి వల్ల, లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు వల్ల నెలంతా ఆర్థికంగా బాగా గడిచిపోతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి.  లగ్జరీ వస్తువులను కొనుగోలు చేస్తారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే అవకాశం కూడా రావచ్చు. మీరు పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనం పొందవచ్చు. ఉద్యోగాలు చేసే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆదాయ పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది.


వృత్తి, ఉద్యోగాల్లో ప్రశాంత పరిస్థితులు నెల కొంటాయి. పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. లాభ స్థానంలో ఉన్న శుభ గ్రహాల వల్ల ఆదా యం దినదినాభివృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. సప్తమ శని వల్ల ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు. తరచూ అనారోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు తప్పకపోవచ్చు. 

►ALSO READ | జ్యోతిష్యం: జూన్ లో ఆరు గ్రహాలు మార్పు... సింహరాశి వారి ఫలితాలు ఇవే..!

జీవిత భాగస్వామి తరఫు నుంచి సంపద పెరుగుతుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పిల్లలు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.