కాగజ్‌నగర్, వెలుగు: మట్టి, ఇసుక అక్రమంగా తరలిస్తే సహించేది లేదని కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. గురువారం కాగజ్‌నగర్ పట్టణంతో పాటి మండలంలో పర్యటించారు. కాగజ్ నగర్ మండలం గన్నారం, మాండవ, ఆరెగూడ, అనుకోడ గ్రామాల చెరువులను పరిశీలించారు. మట్టి తవ్వి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నజ్రుల్‌నగర్ లో మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని అనుమతులు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్ ను ఆదేశించారు. అక్రమ ఇసుక, మట్టి రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
