టాటా కార్లపై రూ.55 వేల వరకు డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..జూన్ 30 వరకే ఆఫర్

టాటా కార్లపై రూ.55 వేల వరకు డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..జూన్ 30 వరకే ఆఫర్

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తమ ప్యాసింజర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఈ నెల  30 వరకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఇస్తోంది. ఇంగ్లిష్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆటోకార్ ఇండియా రిపోర్ట్  ప్రకారం,  కొన్ని మోడళ్లపై కస్టమర్లు గరిష్టంగా రూ.55 వేల వరకు ప్రయోజనాలను పొందొచ్చు. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే, టాటా పంచ్,  టియాగో ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిఫ్ట్ మోడళ్లకు ఈ డిస్కౌంట్లు వర్తించవు.  కార్పొరేట్ డిస్కౌంట్లను సాధారణ వినియోగదారుల ఆఫర్లతో కలపడానికి వీల్లేదు.

ఆఫర్స్ ఇలా..

టాటా నెక్సాన్,  టాటా కర్వ్  మోడళ్లపై అత్యధికంగా రూ.55వేల వరకు గరిష్ట ప్రయోజనాలు పొందొచ్చు.
టాటా హారియర్, టాటా సఫారీ ( డీజిల్) ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూవీలపై కస్టమర్లు రూ.45వేల వరకు బెనిఫిట్స్ అందుకోవచ్చు.
టాటా ఆల్ట్రోజ్ హ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.40వేల వరకు తగ్గింపు ఉంది.
టాటా టియాగో (ప్రీ–-ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిఫ్ట్)పై రూ.35వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.
టాటా టిగోర్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూ.30వేల వరకు ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఆఫర్లన్నీ ప్రధానంగా 2026 మోడల్ ఇయర్ వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాత్రమే వర్తిస్తాయి.