ఆఫ్ఘనిస్తాన్తో టెస్టుకు భారత్ ప్లేయింగ్ XI ఫిక్స్?.. ఆ నలుగురికి నో ఛాన్స్!

ఆఫ్ఘనిస్తాన్తో టెస్టుకు భారత్ ప్లేయింగ్ XI ఫిక్స్?.. ఆ నలుగురికి నో ఛాన్స్!

India Playing XI: ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు భారత్ రెడీ అయింది. శనివారం (జూన్ 6) నుంచి న్యూ చండీగఢ్ వేదికగా ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇండియా జోరుగా ప్రాక్టీస్ చేస్తుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్‌లో సత్తా చాటిన ప్లేయర్స్ కి అవకాశం లభించింది.  

కొత్త వాళ్లకి ఛాన్స్: 
సాయి సుదర్శన్‌తో పాటు నితీష్ కుమార్ రెడ్డి, దేవదత్ పడిక్కల్ రీఎంట్రీ ఇవ్వగా.. హర్ష్‌దూబే, గుర్నూర్ బ్రార్ తొలిసారి టెస్ట్ జట్టు కోసం ఎంపికయ్యారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుండగా.. కేఎల్ రాహుల్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఫామ్‌ లేమితో రిషభ్ పంత్ తన వైస్ కెప్టెన్సీని కోల్పోయాడు.

గిల్ ఆడేది ఆ ప్లేస్ లోనే: 
టెస్ట్ క్రికెట్‌లో సత్తా చాటిన ఆటగాళ్లను పట్టించుకోకుండా ఐపీఎల్ స్టార్లను ఎంపిక చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.ఈ క్రమంలో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగబోతుండగా, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ మిడిలార్డర్‌లో ఆడే అవకాశం ఉంది. ఇక నితీష్ రెడ్డి ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగనుండగా.. వాషింగ్టన్ సుందర్, హర్ష్‌దూబే, కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలని షేర్ చేసుకుంటారు. ఈ మ్యాచ్‌తోనే హర్ష్‌దూబే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణ పేస్ బాధ్యతలని పంచుకోనున్నారు. ఒకవేళ గిల్ ఓపెనర్‌గా వస్తే రాహుల్.. మిడిలార్డర్‌లో ఆడనున్నాడు. 

ఆ నలుగురికి నో ఛాన్స్: 
తొలిసారి భారత జట్టు నుంచి పిలుపును అందుకున్న గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్‌లతో పాటు దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌లకు మరోసారి  నిరాశే ఎదురుకానుంది. ఈ నలుగురు ప్లేయర్స్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. గుర్నూర్ బ్రార్ ఎంపికపై ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. రంజీ ట్రోఫీలో 60 వికెట్లు తీసిన ఆకీబ్ నబీని కాదని గుర్నూర్ బ్రార్‌ను సెలక్ట్ చేయడాన్ని మాజీ క్రికెటర్లు తీవ్రంగా తప్పుబట్టారు. గత రెండున్నర నెలలుగా టీ20 ఫార్మాట్‌కు అలవాటు పడిన ఇండియన్ ప్లేయర్స్.. రెడ్ బాల్ ఫార్మాట్‌లో ఎలా ఆడతారనేది సందేహంగా మారింది.

భారత తుది జట్టు: 
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్‌దూబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ 

అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్‌కు ఎంపికైన భారత జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్‌దూబే, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్, మానవ్ సుతార్.