ఇప్పటికే ముదురుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధంతో పెరిగిన క్రూడ్ సెగలు భారత స్టాక్ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. ఇదే క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలపై 10 నుంచి 12.5 శాతం వరకు కొత్త సుంకాలను ప్రకటించారు. ఈ క్రమంలో ఇండియాపై 10 శాతం పన్ను విధించటంతో శుక్రవారం దేశీయ మార్కెట్లు నష్టాల కల్లోలం చిక్కుకున్నాయి. ఉదయం 10.03 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 833 పాయింట్లు, నిఫ్టీ 243 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 480 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 688 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
వారాంతంలోని ఈ పరిణామాలతో దేశీయంగా అన్ని రంగాల సూచీలు నేడు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ బ్యారె ధర 100 డాలర్లను దాటడం అది రానున్న రోజుల్లో 120 డాలర్ల వరకూ పెరగొచ్చని నిపుణులు అంచనాలతో పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకూ హార్మూజ్ జలసంధికే పరిమితమైన ఇరాన్ అమెరికా యుద్ధం ఇప్పుడు తాజాగా ఎర్రసముద్రం ప్రాంతానికి కూడా విస్తరించటం, హౌతీలు షిప్పులపై దాడులు చేస్తూ ఆ మార్గం నుంచి కూడా క్రూడ్ సరఫరాను అడ్డుకోవటంతో పరిస్థితులు వేగంగా దిగజారిపోతున్నాయి. ఈ ప్రపంచ ప్రపంచ మార్కెట్లతో పాటు భారతీయ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
ఇదే క్రమంలో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరుగుతూ భారీగా విక్రయాలకు దిగుతుండటంతో ఇండియా విక్స్ సూచీ కూడా 14 పాయింట్లు దాటేసింది. యుద్ధానికి తోడు సుంకాలు జతకట్టడంతో ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
