ఇవాళ( జులై 24) విద్యాసంస్థలు బంద్.. పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు 

ఇవాళ( జులై 24) విద్యాసంస్థలు బంద్.. పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు 
  •     కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని,చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీసం 
  • కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ 
  •     బంద్ ప్రభావంతో ఓయూ, జేఎన్‌‌టీయూ, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

హైదరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, చనిపోయిన విద్యార్థుల ఒక్కో కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్ యూఐ, పీడీఎస్ యూ, ఏఐఎఫ్ డీఎస్, ఏఐపీఎస్ యూ, ఏఐఎస్ బీ సంఘాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌‌కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ నీట్, నెట్ పరీక్షల రద్దుతో పాటు పేపర్ లీకేజీ వెనుక ఉన్న పెద్ద తలకాయలను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విద్యాసంస్థలన్నీ స్వచ్ఛందంగా బంద్‌‌లో పాల్గొనాలని కోరారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు నారాయణగూడ చౌరస్తా నుంచి వై జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు.

పరీక్షలు వాయిదా వేసిన యూనివర్సిటీలు

విద్యార్థి సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ), జేఎన్‌‌టీయూ పరిధిలో శుక్రవారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. త్వరలోనే కొత్త తేదీలను వెల్లడిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని కాలేజీలకు సమాచారం అందించారు. బంద్ ప్రభావంతో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి.