GenZ విక్టరీ.. NTA నుంచి 47 మంది అధికారులు ఔట్.. తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు

GenZ విక్టరీ.. NTA నుంచి 47 మంది అధికారులు ఔట్.. తొలగిస్తూ కేంద్రం ఉత్తర్వులు

ఢిల్లీ: NEET పేపర్ లీక్ వివాదంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జేఈఈ, నీట్ పరీక్షలతో సహా కీలక పరీక్షలు నిర్వహిస్తున్న NTA ప్రక్షాళన దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. NTAలో కీలకంగా ఉన్న 47 మంది అధికారులను తొలగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ 47 మందిలో కొంతమందిపై.. తొలగింపులతో పాటు, చట్టపరమైన, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. NTA ఏజెన్సీ పనితీరును సంస్కరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

రాబోయే రోజుల్లో మరిన్ని దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. NTAలో మంజూరైన 39 పర్మినెంట్ పోస్టులకు గాను 24 మంది శాశ్వత ఉద్యోగులతోనే ఏజెన్సీ పనిచేస్తోందని జులై 22న విద్యా మంత్రిత్వ శాఖ లోక్‌సభకు వివరించింది. NTA కార్యకలాపాల కోసం 73 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 124 మంది అవుట్‌సోర్స్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు.