Joe Root: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ హఠాత్తుగా టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, ఆ జట్టుకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయడం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి ప్రధాన సవాలుగా మారింది. వైస్ కెప్టెన్‌గా ఉన్న యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌కు ఈ బాధ్యతలు ఇస్తారని అందరూ భావించినప్పటికీ, బోర్డు మాత్రం మళ్లీ అనుభవజ్ఞుడైన జో రూట్‌కే నాయకత్వం అప్పగించేందుకు సిద్ధమవుతోంది.
జో రూట్‌నే ఎందుకు సెలక్ట్ చేశారంటే:
న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ సమయంలో లండన్ నైట్‌క్లబ్ వివాదంతో బెన్ స్టోక్స్ సస్పెన్షన్‌కు గురైనప్పుడు కూడా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జో రూట్‌కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. హ్యారీ బ్రూక్‌కు గతంలో కొన్ని వివాదాలతో సంబంధం ఉండటంతో, జట్టును పద్ధతిగా నడిపించేందుకు ఒక బాధ్యతాయుతమైన నాయకుడు కావాలని బోర్డు భావిస్తోంది. గతంలో ఆస్ట్రేలియా జట్టు స్టీవ్ స్మిత్ వివాదం తర్వాత టిమ్ పైన్‌ను కెప్టెన్‌గా చేసినట్లే, ఇప్పుడు ఈసీబీ కూడా జో రూట్ వైపే ఇంట్రెస్ట్ చూపిస్తుంది.
పాకిస్థాన్ సిరీస్ నుంచి యాషెస్ వరకు:
ఆగస్టు 19వ తేదీ నుంచి పాకిస్థాన్‌తో జరగబోయే 3 టెస్టుల సిరీస్ నుంచి జో రూట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతారని తెలుస్తుంది. ఈ నియామకం కేవలం ఒక సిరీస్‌కే పరిమితం కాకుండా, వచ్చే ఏడాది జరగబోయే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ వరకు కొనసాగే ఛాన్స్ ఉంది. మరోవైపు, ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్‌ను వెతికే పనిలో బోర్డు ఉంది. మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ ఈ పదవిని చేపట్టడానికి నిరాకరించారు.
కెప్టెన్‌గా జో రూట్ పాత రికార్డులు:
జో రూట్ గతంలో 2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల పాటు ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్‌గా కొనసాగారు. మొత్తం 64 టెస్టుల్లో జట్టును నడిపించి, 27 మ్యాచ్‌ల్లో విజయాలను అందించారు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ పర్యటనల్లో ఓటముల తర్వాత అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం హ్యారీ బ్రూక్ తన బ్యాటింగ్‌పై పూర్తి దృష్టి పెట్టేందుకు కొంత సమయం ఇవ్వాలని, అప్పటి వరకు అనుభవజ్ఞుడైన జో రూట్‌తోనే జట్టును ముందుకు తీసుకెళ్లాలని ఈసీబీ వెల్లడించింది.
