‘సింగూరు’కు వరద తాకిడి.. హైదరాబాద్ సిటీలో తీరనున్న ట్యాంకర్ కష్టాలు

‘సింగూరు’కు వరద తాకిడి.. హైదరాబాద్ సిటీలో తీరనున్న ట్యాంకర్ కష్టాలు
  •     జలాశయంలో వారం కింద 2.546 టీఎంసీలే
  •     ప్రస్తుతం 3.546 టీఎంసీలు      
  •    అక్టోబర్​ 14 వరకూ బేఫికర్

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరానికి తాగునీటిని అందిస్తున్న ప్రధాన జలాశయాల్లో ఒకటైన సింగూరుకు వరద తాకిడి పెరుగుతోంది. నాలుగైదు రోజులుగా సింగూరు పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయంలోకి ఒక టీఎంసీ నీరు చేరిందని, ఇది సిటీకి నెలకు సరిపోతుందని అధికారులు తెలిపారు. వారం కింద సింగూరులో 2.546 టీఎంసీలు ఉండగా, సెప్టెంబరు ఆఖరు నాటికే సరిపోతుందని భావించారు. ప్రస్తుతం మరో టీఎంసీ కలిసి 3.546 టీఎంసీలు అవ్వడంతో అక్టోబరు 14 వరకూ సమస్య లేదంటున్నారు. 

రెండు టీఎంసీలకు చేరితే పంపింగ్​ 

సింగూరు ఫుల్​ట్యాంక్​ కెపాసిటీ 29.910 టీఎంసీలు కాగా, బ్రిడ్జికి రిపేర్లు చేయాల్సి ఉండడంతో కొంతకాలంగా 6 టీఎంసీలకు మించి నిల్వ ఉంచడం లేదు. ఇప్పుడు 3.546 టీఎంసీలు ఉండగా, వర్షాలు కురవని పక్షంలో రెండు టీఎంసీలకు(డెడ్​స్టోరేజీ) చేరితే పంపింగ్​చేయడానికి రెడీ అవుతున్నారు.