Team India Head Coach: పసికూన ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లలో వైట్‌వాష్‌కు గురై, వరుసగా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. జింబాబ్వే పర్యటనలో భాగంగా హరారే వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించి జింబాబ్వేను చిత్తుగా ఓడించింది. భారత టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది ఫస్ట్ గెలుపు కావడం విశేషం.
హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్:
ఈ జింబాబ్వే టూరుకు ప్రధాన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు ఆయన సపోర్ట్ స్టాఫ్‌కు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. వారి స్థానంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (COE) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. లక్ష్మణ్ పర్యవేక్షణలో అనుభవం లేని యంగ్ బౌలర్లతో భారత్ అద్భుత ప్రదర్శన చేయడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. లక్ష్మణ్ టీమ్ ప్లానింగ్ అద్భుతంగా ఉందంటున్నారు. కనీసం టీ20 ఫార్మాట్‌లోనైనా ఆయననే భారత హెడ్ కోచ్‌గా కొనసాగించాలని నెట్టింట బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు.
ALSO READ : చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ ఔట్..
మయాంక్ యాదవ్ మెరుపులు.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం:
ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వేను భారత బౌలర్లు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 రన్స్ కే కట్టడి చేశారు. జింబాబ్వే బ్యాటర్లలో వెస్లీ మాధెవెరె (39), తాదివనాషే మరుమని (27 నాటౌట్) రాణించగా, ఇండియన్ బౌలర్లలో మయాంక్ యాదవ్ (2/18), ప్రిన్స్ యాదవ్ (2/19) చెరో రెండు వికెట్లతో మెరిశారు. అనంతరం 126 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఈజీగా ఛేదించింది. 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ కేవలం 19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ (35), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (28 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆటడంతో ఇండియా గెలిచింది.
