హైదరాబాద్, వెలుగు: వుమెన్స్ టీ20 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో (3 వికెట్లు, 7 పరుగులు) చెలరేగిన యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తమ జట్టు వ్యూహాలను పంచుకున్నారు.
మ్యాచ్‌కు ముందే తమ స్పిన్ బౌలర్లు అందరూ (ప్రేమ, తాను, దీప్తి, రాధా యాదవ్ ) కలిసి కూర్చుని వ్యూహరచన చేస్తామని చరణి తెలిపారు. సీనియర్లు చెప్పిన విషయాలను మైదానంలో సమర్థవంతంగా అమలు చేయడంపైనే తాము దృష్టి పెడతామని ఆమె స్పష్టం చేశారు.
పిచ్‌ను పరిశీలించిన తర్వాత బంతికి మంచి టర్న్ లభిస్తుందని గ్రహించి, కేవలం స్టంప్స్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడంపైనే పూర్తిగా దృష్టి పెట్టానని చెప్పారు. విషయాలను ఎక్కువగా ఆలోచించకుండా సింపుల్‌గా ఉంచుకోవడం, బేసిక్స్‌పైనే ఫోకస్ పెట్టడమే తన సక్సెస్‌కు సీక్రెట్ అని చరణి పేర్కొన్నారు.
ఇక అద్భుతంగా రాణించిన తోటి బౌలర్ ప్రేమ రావత్‌ను ప్రశంసిస్తూ.. ఆమె ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ చేయగల సహజ ప్రతిభావంతురాలైన క్రికెటర్ అని కొనియాడారు. బౌలర్లకు సహకరించే ఈ వికెట్‌పై సుమారు 120 పరుగులు సరైన స్కోరేనని అభిప్రాయపడిన ఆమె, ఇకపై టోర్నమెంట్లో తాము ఒక్కో మ్యాచ్‌పైనే పూర్తి దృష్టి పెడతామని తేల్చిచెప్పారు.
