ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు అందుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు అందుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
  • పీసీసీ చీఫ్‌‌గా రెండేళ్లు పూర్తి చేసుకున్న మహేశ్‌‌ గౌడ్‌కి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు 

హైదరాబాద్​, వెలుగు: పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్సీ మహేశ్‌‌ కుమార్ గౌడ్‌‌కు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన ఆయన ప్రస్థానం అభినందనీయమని కొనియాడారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్‌‌లో పోస్టు చేశారు. బీసీ వర్గానికి చెందిన బిడ్డకు తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడం కేవలం పదవి ఇవ్వడం కాదని, సామాజిక న్యాయంపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో, రాహుల్ గాంధీ మార్గదర్శకత్వంలో పార్టీని బలోపేతం చేయడంలో మహేశ్‌‌ గౌడ్ కీలకంగా పనిచేస్తున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. ఇదే అంకితభావంతో ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు.