రంగారెడ్డి: ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి పట్నం రుక్కమ్మ (95) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న రుక్కమ్మ శుక్రవారం (జూలై 24) సాయంత్రం తుది శ్వాస విడిచారు.
మహేందర్ రెడ్డి స్వగ్రామం షాబాద్ మండలం గొల్లూరుగూడలో రుక్కమ్మ అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. రుక్కమ్మ మరణవార్త విన్న మాజీ మంత్రులు పటోళ సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి మహేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి రుక్కమ్మ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. స్వర్గీయ మాజీ హోంమంత్రి పి ఇంద్రారెడ్డి కి రుక్కమ్మ పెద్ద అక్క.
