గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరోగా ఏడాదంతా గ్యాప్ తీసుకున్నారు వెంకటేష్. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన చిరంజీవి సినిమా ‘మనశంకర వరప్రసాద్ గారు’లో ఆయన కనిపించినా అది అతిథి పాత్రే. అయితే గ్యాప్‌ను ఫుల్‌ఫిల్ చేసేలా వరుస ప్రాజెక్ట్స్‌తో స్పీడు పెంచారు వెంకటేష్. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, క్రైమ్ ఎలిమెంట్స్ కలగలిసిన ఈ ఎంటర్‌టైనర్ దసరా సందర్భంగా అక్టోబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు వెంకటేష్‌తో సినిమా చేసేందుకు అనిల్ రావిపూడి రెడీగా ఉన్నారు. ఇందులో కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అని ఇప్పటికే రిలీజ్ డేట్ రివీల్ చేశారు. ‘జనవరి 13 విడుదల’ అనే డిఫరెంట్ టైటిల్ వినిపిస్తోంది. ఇవి రెండూ కాక మరో సినిమా చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ట చెప్పిన స్టోరీ లైన్ వెంకటేష్‌కు నచ్చిందట. దీంతో ఫుల్ నెరేషన్, స్క్రిప్ట్ వర్క్‌పై వశిష్ట దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
