వాషింగ్టన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్‌తో పాటు మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్ర దేశాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై మేం ఇంకా యుద్ధాన్ని ఉధృతం చేయలేదని.. త్వరలోనే దాడులను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. అమెరికా బలగాలు ఇరాన్ సైనికులు తరిమికొట్టాయని.. మా జోలికి వచ్చినవారిని వదిలిపెట్టమని తేల్చి చెప్పారు. ఇక, ఇరాన్ వారసత్వ ప్రణాళిక గురించి తమకు తెలియదని పేర్కొన్నారు. అరబ్ దేశాలపై ఇరాన్ దాడి చేయడం తమకు ఆశ్చర్యం వేసిందని అన్నారు. ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న గల్ఫ్ దేశాలు ఇరాన్‌పై దాడులు చేసేందుకు ముందుకు వస్తున్నాయని.. ఇది తమకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు.
గల్ఫ్ దేశాల్లోని హోటళ్లు, మానవ నివాసాలపై ఇరాన్ దాడులు చేయడం అరబ్ దేశాల్లో కోపాన్ని రేకెత్తించిందని అన్నారు. అరబ్ నాయకత్వంతో తనకు పరిచయం ఉందని.. వారు కఠినమైన, తెలివైన నాయకులని పేర్కొన్నాడు. ఇరాన్ ప్రజలు ప్రభుత్వ నియంత్రణను పొందడానికి అమెరికా సైనిక చర్యకు మించిన యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడదని ట్రంప్ హాట్ కామెంట్స్ చేశారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్‌పై దాడులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. దీంతో మరికొన్ని రోజులు బాంబులు, మిస్సైళ్లతో మిడిల్ ఈస్ట్ రణరంగంగానే ఉండనుంది.
