టీమిండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన కీలక పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా.. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోబోతోంది. మార్చి 5న ఇంగ్లండ్తో టీమిండియా తలపడుతుంది. మార్చి 4న న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ జరగనుంది.
𝗧𝗵𝗲 𝘁𝗶𝘁𝗹𝗲 𝗱𝗲𝗳𝗲𝗻𝗰𝗲 𝗰𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲𝘀 🇮🇳#TeamIndia are semi-finals bound in the #T20WorldCup 👏
— BCCI (@BCCI) March 1, 2026
Updates ▶️ https://t.co/ur4pr8Bi3K#MenInBlue | #INDvWI pic.twitter.com/45sjJydel9
సెమీ ఫైనల్ వన్లో గెలిచిన టీం, సెమీ ఫైనల్ 2లో గెలిచిన టీం.. మార్చి 8న జరిగే ఫైనల్ మ్యాచ్లో తలపడతాయి. గెలిచి తీరాల్సిన మ్యాచ్లో సంజూ శాంసన్ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది. 50 బంతుల్లో 4 సిక్సులు, 12 ఫోర్లతో సంజూ శాంసన్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచినప్పటికీ సంజూ శాంసన్ చేసిన 97 పరుగులు అతనిపై వచ్చిన విమర్శలకు వంద శాతం సమాధానమిచ్చాయి.
A clinical victory and Team India are through to the semi-final of the ICC Men's #T20WorldCup 2026!
— Star Sports (@StarSportsIndia) March 1, 2026
Onwards & upwards! 🚀
ICC Men’s #T20WorldCup Semi-Final 2 👉 #INDvENG | THU, 5 MAR, 6 PM pic.twitter.com/nIGES97XJf
ఇంగ్లండ్తో సెమీ ఫైనల్ వేళ అభిషేక్ శర్మ పేలవ ప్రదర్శన ఒక్కటే టీమిండియాను కలవరపెడుతుంది. సంజూ శాంసన్ ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియా సెమీస్ గండం కూడా గట్టెక్కే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ కచ్చితంగా మెరుగుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరో ఒకరు నిలబడి కలబడటం ప్రతీ మ్యాచ్లో సాధ్యపడే అంశం కాదు. టీమిండియా బౌలింగ్ పరంగా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంగ్లండ్ జట్టు కూడా మరీ అంత ఆషామాషీ టీం అయితే కాదు. ఇంగ్లండ్ బ్యాటర్లలో హిట్టర్లు ఉన్నారు. టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను వీలైనంత కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
