పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్త మైంది. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గల్ఫ్ దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థితులను తెలంగాణ సర్కార్ సమగ్రంగా పర్యవేక్షిస్తోం ది. తెలంగాణ పౌరులు లేదా తెలంగాణలో ఉన్న వారి కుటుంబ సభ్యులు ఎలాంటి ఇబ్బందులు, ప్రయాణ అంతరాయాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్ వందన బరువా +91 9871999044, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్. చక్రవర్తి +91 9958322143, లైజన్ ఆఫీసర్ జావేద్ హుస్సేన్ 9910014749, లైజన్ ఆఫీసర్ రక్షిత్ నాయక్ +91 9643723157 ఈ కంట్రోల్ రూమ్ను సంప్రదించవచ్చు.
