T20 World Cup: వెస్టిండీస్పై ఘన విజయం.. సెమీస్కి దూసుకెళ్లిన భారత్

T20 World Cup: వెస్టిండీస్పై ఘన విజయం.. సెమీస్కి దూసుకెళ్లిన భారత్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా  కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత జట్టు ఓపెనర్ సంజూ శాంసన్ (97 నాటౌట్) అద్భుతమైన బ్యాటింగ్ తో ఘన విజయం సాధించింది. దీంతో 5  వికెట్ల తేడాతో గెలిచి నేరుగా సెమీస్ లోకి అడుగు పెట్టింది. మార్చ్ 5వ తేదీన  ఇంగ్లాండ్ జట్టుతో సెమీఫైనల్ లో తలపడబోతుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అయితే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని భారత్ నిర్ణయించడంతో.. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. 85 పరుగులు వద్ద కరేబియన్ జట్టు తొలి వికెట్ ను కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ లో రోస్టన్ చేజ్ (40), షాయ్ హోప్ (32), రోవ్‌మన్ పావెల్ (34), జాసన్ హోల్డర్ (37),  షిమ్రాన్ హెట్మెయర్ (27) రాణించడంతో విండీస్ 195 పరుగులు చేసింది. 

అనంతరం 196 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టుకు ప్రారంభంలోనే బిగ్ షాక్ తగిలింది. 29 పరుగుల వద్ద అకేలే హోసెన్ వేసిన బంతికి  టీమిండియా  ఓపెనర్ అభిషేక్ శర్మ (10) ఆడిన భారీ షాట్ కి బాల్ బ్యాట్ కి ఎడ్జ్ తాకడంతో షిమ్రోన్ హెట్మేయర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఇషాన్ కిషన్ (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయాడు. 41 పరుగుల వద్ద జాసన్ హోల్డర్ బౌలింగ్ లో హెట్మేయర్ క్యాచ్ పట్టడంతో డగౌట్ కి వెళ్లిపోయాడు. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (18).. కాసేపు బ్యాట్ ఝలిపించినప్పటికీ, కేవలం 18 పరుగులు చేసిన తర్వాత షామర్ జోసెఫ్ బౌలింగ్ లో రూథర్‌ఫోర్డ్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

చివర్లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ (15 బాల్స్ లోనే 4 ఫోర్లు, ఒక సిక్సుతో 27 పరుగులు) అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. జాసన్ హోల్డర్ బౌలింగ్ లో బిగ్ షాట్ ఆడబోయి షిమ్రాన్ హెట్మెయర్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన హార్దిక్ పాండ్యా సైతం విండీస్ బౌలర్లపై దూకుడుగా బ్యాటింగ్ చేయగా, 19 ఓవర్ వేసిన షామర్ జోసెఫ్ బౌలింగ్ లో జాసన్ హోల్డర్ కి క్యాచ్ ఇచ్చి పాండ్యా (17) పెవిలియన్ బాట పట్టాడు.  లాస్ట్ ఓవర్ లో ఫస్ట్ బాల్ కే సిక్సు కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు సంజూ శాంసన్. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, షామర్ జోసెఫ్ తలో రెండు వికెట్లు తీసుకోగా,  అకేలే హోసెన్ ఒక వికెట్ పడగొట్టాడు.