VijayRashmika: విజయ్ సొంతూరిలో సత్యనారాయణ వ్రతం.. రష్మిక క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ వైరల్!

VijayRashmika: విజయ్ సొంతూరిలో సత్యనారాయణ వ్రతం.. రష్మిక క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ వైరల్!

టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు తమ ప్రేమ బంధాన్ని పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. గత వారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్ వేదికగా అత్యంత వైభవంగా, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో ఈ జంట ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హైదరాబాద్ చేరుకున్న ఈ కొత్త జంట, తమ వైవాహిక జీవితాన్ని ఆధ్యాత్మికంగా, సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.

తుమ్మనపేటలో సందడి..!

సోమవారం ఉదయం ( మార్చి 2న )  విజయ్ దేవరకొండ తన సతీమణి రష్మికతో కలిసి తన స్వగ్రామమైన తెలంగాణలోని తుమ్మనపేటకు చేరుకున్నారు. విజయ్ దేవరకొండకు తన మూలాలంటే ఎంత గౌరవమో మనకు తెలిసిందే. అందుకే, పెళ్లి తర్వాత తన సొంతూరిలోని ఫామ్ హౌస్‌లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టు వస్త్రాల్లో మెరిసిపోతున్న ఈ జంటను చూడటానికి గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. ఇంటి కోడలిగా రష్మిక సంప్రదాయబద్ధంగా పూజలో పాల్గొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. పూజ అనంతరం ఊరి వారందరికీ విజయ్ స్వయంగా భోజనాలు పెట్టించారు.

వైరల్ అవుతున్న 'క్యూట్' వీడియో

సోషల్ మీడియాలో ప్రస్తుతం 'విరోష్' (#ViRosh) హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా పూజ జరుగుతున్న సమయంలో తీసిన ఒక చిన్న వీడియో క్లిప్ అభిమానుల మనసు గెలుచుకుంటోంది. పూజలో కూర్చున్న సమయంలో విజయ్ ని చూస్తూ కనిపించింది రష్మిక. విజయ్ తనని చూసేసరికి రష్మిక ఒక్కసారిగాముఖాన్ని పక్కకు తిప్పుకుని మురిసిపోయింది. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నేషనల్ క్రష్ సిగ్గుపడుతుంటే చూడముచ్చటగా ఉంది" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

►ALSO READ | సైబర్ క్రైమ్‎లో రేణు దేశాయ్ ఫిర్యాదు.. ఎందుకంటే..?

వెయిటింగ్ ఫర్ రిసెప్షన్!

విజయ్ దేవరకొండ తన సంతోషాన్ని కేవలం కుటుంబానికే పరిమితం చేయలేదు. తన పెళ్లి సందర్భంగా ఆదివారం దేశవ్యాప్తంగా పలు ప్రధాన ఆలయాల్లో తన అభిమానుల కోసం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో స్వీట్లు పంపిణీ చేసి అభిమానుల ఆశీస్సులు అందుకున్నారు. ఇక అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ రిసెప్షన్ ఈ బుధవారం . మార్చి 4 హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ దిగ్గజాలు హాజరుకానున్నారు. ఉదయ్‌పూర్ పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులే, సన్నిహితులతో జరుపుకోవడంతో.., ఈ రిసెప్షన్ వేడుకను అత్యంత భారీగా ప్లాన్ చేశారు ఈ కొత్త జంట.