రాహుల్ పర్యటన వేల కోట్లు ఢిల్లీకి తరలించడానికే: కేంద్రబండి సంజయ్

 రాహుల్ పర్యటన వేల కోట్లు ఢిల్లీకి తరలించడానికే: కేంద్రబండి సంజయ్

గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ రూ.10 వేల కోట్లు ఇవ్వగలదని సీఎం రేవంతే చెబుతుండ్రు ఏఐసీసీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన పర్యటన పాకెట్ మనీ కోసమేనా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ రూ.10 వేలకోట్లు ఇవ్వ గలదని సీఎం రేవంత్ రెడ్డే చెప్పారన్నారు. ఒక్క తెలంగాణ నుంచే వెయ్యి కోట్లు గాంధీ కుంబానికి వెళ్తాయని ఆరోపించారు. 

 కామారెడ్డి బాన్సువాడలో జరిగిన కలహాలలో జైలుకి పోయిన బాధితుల కుటుంబ సభ్యులను బండి సంజయ్ పరామర్శించారు.  ముఖ్యమంత్రి బలిసినోడిని వదిలి పెట్టి నిరు పేదల జోలికి పోతున్నారు. రాహుల్ గాంధీ చేస్తున్నది రాజకీయ పర్యటనా? లేక కలెక్షన్ల సమీక్షనా? అని రాష్ట్రం  చూస్తుందని ఎక్స్ లో ట్వీట్ చేశారు. గత 15 రోజుల క్రితం బాన్సువాడ పట్టణం

►ALSO READ | వికారాబాద్ లో రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ లో ఫాతిమా కళాశాలను వదిలి పెట్టి ఖమ్మంలో కళాశాలలను కూల్చిన గొప్పతనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది.  రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల జోలికి వస్తె అదే బోల్డోజర్లు తీసుకుని నీపైకి వస్తాం.  గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లనే మనం ఈ గోస పడుతున్నాం.వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో మనం ఆలోచించి ఓటు వేయాలి.  కామారెడ్డిలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డిపై దాడి చేశారు.కాంగ్రెస్ పార్టీ దాడులు చేస్తే మేము సహించి ఊరుకోవడానికి బిఆర్ఎస్ నాయకులం కాదు.  దేశంలో 20 రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం.  అరాచకాలు, కూల్చివేతలు వెంటనే మానండి, ఇలాంటివి పునరావృతం అయితే మా ప్రణాళిక మేము సిద్ధం చేసుకుంటాం.

గత 9 రోజులుగా వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిభిరం కొనసాగు వేశంలో పాల్గొని డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేసేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఇక్కడికి వచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళిక బద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కా ర్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై వారితో చర్చించారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాహుల్ను ఉద్దేశిం చిచేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.