వికారాబాద్ లో రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన మంత్రి వివేక్ వెంకటస్వామి

వికారాబాద్ లో రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన మంత్రి వివేక్ వెంకటస్వామి

వికారాబాద్ చేరుకున్న కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హెలిప్యాడ్ దగ్గర  బొకేతో స్వాగతం పలికిన మంత్రి వివేక్ రాహుల్ గాంధీని శాలువాతో సత్కరించారు. పదిరోజులుగా అనంతగిరిలోని హరిత రిసార్ట్ లో కొనసాగుతున్న తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యేందుకు సోమవారం ( మార్చి 2 ) వికారాబాద్ చేరుకున్నారు రాహుల్ గాంధీ.

ఈ క్రమంలో PAC సమావేశంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఈ సమావేశంలో సంపత్ కుమార్, షబ్బీర్ అలీ, సునీతారావులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. PAC సమావేశంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై రాహుల్ గాంధీ చర్చించినట్లు సమాచారం. 

రాహుల్ గాంధీతో పాటు కేసి వేణుగోపాల్ PAC సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత తిరిగి హైదరాబాద్ బయలుదేరారు మంత్రులు. అనంతరం డీసీసీ సమావేశానికి హరిత రిసార్ట్ కు బయలుదేరారు రాహుల్ గాంధీ.