ఇరాన్‌‌‌‌పై దాడికి సౌదీ యువరాజు విజ్ఙప్తి..!

ఇరాన్‌‌‌‌పై దాడికి సౌదీ యువరాజు విజ్ఙప్తి..!
  • ట్రంప్‌‌‌‌కు పలుమార్లు ఫోన్‌‌‌‌ కాల్..  వాషింగ్టన్ పోస్ట్‌‌‌‌ కథనం

రియాద్: సౌదీ అరేబియా యువరాజు మహ్మద్​ బిన్‌‌‌‌ సల్మాన్‌‌‌‌ పైకి శాంతి మంత్రం పఠిస్తూనే ఇరాన్‌‌‌‌పై దాడికి అమెరికాకు విజ్ఞప్తులు చేశారని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. ఇస్లామిక్‌‌‌‌ రిపబ్లిక్‌‌‌‌ దేశమైన ఇరాన్‌‌‌‌ పై దాడి చేయాలని డొనాల్డ్‌‌‌‌ ట్రంప్‌‌‌‌పై సల్మాన్‌‌‌‌ ఒత్తిడి తెచ్చినట్టు తెలిపింది. ఇందులో భాగంగా గత నెలలో ట్రంప్‌‌‌‌కు పదేపదే ప్రైవేట్‌‌‌‌ ఫోన్‌‌‌‌ కాల్స్‌‌‌‌ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఈ ఏడాది జనవరిలో సౌదీ యువరాజు మాట్లాడుతూ.. ఇరాన్‌‌‌‌పై దాడి చేయడానికి తమ భూభాగాన్ని గానీ, గగనతలాన్ని గానీ ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ప్రకటించారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తామని, అమెరికా- ఇరాన్‌‌‌‌ చర్చల ద్వారా 
సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. కానీ తెర వెనుక మాత్రం భిన్నమైన వ్యూహాన్ని నడిపినట్టు సమాచారం.