డీసీసీలు పవర్ ఫుల్..జిల్లాకు వారే సుప్రీం: రాహుల్ గాంధీ

డీసీసీలు పవర్ ఫుల్..జిల్లాకు వారే సుప్రీం: రాహుల్ గాంధీ

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పవర్ ఫుల్ అని, జిల్లాకు వారే సుప్రీం అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఆయన అనంతగిరిలో నిర్వహించిన డీసీసీ చీఫ్ ల శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ చీఫ్ లకు క్లాస్ చెప్పారు. కష్టపడి పనిచేస్తే పదవులు మీ వద్దకు వస్తాయని అన్నారు. ఏమీ ఆశిం చకుండా పనిచేస్తేనే ఫలితం ఉంటుందని చెప్పారు. మహాత్మా గాంధీ కి ఒంటిపై ఒక బట్ట తప్ప ఏమిలేదని, బ్రిటిష్ వాళ్ళు గాంధీ ని ఏమి చేయలేక పోయారని గుర్తు చేశారు. ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ చేస్తోందన్న రాహుల్ ఇరాన్ వెనక చైనా,రష్యా ఉందని అన్నారు. ట్రంప్ కు మోదీ సరెండర్ అయ్యారని చెప్పారు. ట్రంప్ కి వ్య తిరేకంగా మోదీ పనిచేయలేరని అననారు. నాయకులు తమ అహాన్ని పక్కన పెట్టి పని చేయాలని చెప్పారు. మన ఈగోల కన్నా పార్టీ ముఖ్యమని చెప్పారు. డీసీసీలు పార్టీ కోసం పని చేయాలని, మరో పదిమందిని తయారు చేయాలని అన్నారు.

రాహుల్ ప్రధాని కావాలి: రేవంత్

దేశం కోసం రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇవాళ అనంతగిరిలో జరిగిన డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు సంద ర్భంగా ఆయన మాట్లాడారు.. పైరవీలు చేయకుండా పనిచేస్తే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని చెప్పారు. తాను 19 ఏండ్లలో జెడ్బీ టీసీ నుంచి సీఎంగా ఎదిగానని అన్నారు. తాను ప్రజా జీవితంలో  ఎన్నడూ పైరవీలు చేయలేదని చెప్పారు. ప్రజా సమస్యల పైన గళం వినిపించానని అన్నారు. తనపై కేసు లు పెట్టారని, నిన్న తాను కోర్టుకూ వెళ్లానని అన్నారు. పరువు నష్టం దావాలు వేసినా వెనుకడుగు వేయలేదని చెప్పారు. సోనియాగాంధీ పేరుతోనే తెలంగాణలోనే అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఐదేండ్ల పోరాటం వల్ల రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారని, ఇందుకోసం దేశంలోని అనేక సమస్యలపై పోరాటం చేశారని చెప్పారు. ఈ దేశంలో రాహుల్ ప్రధాన మంత్రి కావాలంటే అందరం కలిసి మోదీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరం ఉండన్నారు..