ఆర్టీసీ కార్మికులకు జీతాలిచ్చేందుకు నిధుల్లేవ్ : ప్రభుత్వం

ఆర్టీసీ కార్మికులకు జీతాలిచ్చేందుకు నిధుల్లేవ్ : ప్రభుత్వం

సెప్టెంబర్ జీతాలు చెల్లించేందుకు తమ వద్ద నిధులు లేవని ప్రభుత్వం తేల్చి చెప్పింది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాటపట్టారు.  సమ్మెను విరమించి విధుల్లోకి రావాలంటూ ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. ప్రభుత్వం అల్టిమేట్టంను ఏ మాత్రం పట్టించుకోని  ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు.

సమ్మె నేపథ్యంలో కార్మికుల చెల్లించాల్సిన సెప్టెంబర్  వేతనాలు అందలేదు. దీంతో జీతాలు చెల్లించాలంటూ ఆర్టీసీ కార్మికులు హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ పై హైకోర్ట్ ఇవ్వాళ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కార్మికులకు జీతాలు చెల్లించేందుకు తమ వద్ద నిధులు లేవని ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్  కోర్టుకు విన్నవించారు. ఆర్టీసీ వద్ద రూ.7.5కోట్లే ఉన్నాయని, జీతాలు చెల్లించాలంటే రూ.224కోట్లు కావాలని ఏజీ తెలిపారు. అయితే చేసిన పనిరోజులకు జీతాలు చెల్లించపోవడం ఏంటని పిటీషనర్ వాదించారు.