కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్

కొత్త కారు : మారుతీ స్విఫ్ట్ 2024 మోడల్ బుకింగ్స్ ఓపెన్

మారుతి స్విఫ్ట్, అప్పట్లో చాలా మంది ఫేవరెట్ కార్ అంటే ఇదే అని చెప్పేవారు. హాచ్ బ్యాక్ కార్ సెగ్మెంట్లో చాలా కాలం టాప్ ప్లేస్ లో కొనసాగింది ఈ వేరియంట్. ఇప్పుడు మారుతి స్విఫ్ట్ 2024 మోడల్ త్వరలోనే లాంచ్ కానుంది. రూ. 11,000 టోకెన్ మొత్తానికి ఆన్‌లైన్ లేదా డీలర్‌షిప్‌ల వద్ద బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. అప్డేటెడ్ ఫీచర్స్ తో రూపొందిన కొత్త స్విఫ్ట్ కార్ మే 9న లాంచ్ చేయనున్నట్లు మారుతి సంస్థ తెలిపింది. బాలెనొ, ప్రాంక్స్ లోని ఇంటీరియర్ ను పోలి ఉన్న కొత్త ఇంటీరియర్ తో స్విఫ్ట్ 2024 మోడల్ రానుంది. 6 ఎయిర్ బ్యాగులతో, 9ఇంచ్ ల టచ్ స్క్రీన్ తో డ్యాష్ బోర్డు భిన్నంగా ఉంటుంది.

1.2లీటర్, 3సిలిండర్ల కెపాసిటితో దీని పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. టాటా టియాగో, హ్యుండై గ్రాండ్ ఐ10నియోస్, సిట్రియెన్ C3 లకు పోటీగా ఈ మోడల్ రూపొందిందని తెలుస్తోంది.అయితే, మారుతి AMTని కొనసాగిస్తుందా లేదా ఇతర మారుతి మోడళ్లలో కనిపించే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌కి గేర్‌బాక్స్‌ను అప్‌గ్రేడ్ చేస్తుందా అనేది చూడాలి.దీని ధర విషయానికి వస్తే ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగా ఉంటుందనే చెప్పాలి. మారుతి స్విఫ్ట్ 2024 మోడల్ ఎక్స్ షోరూమ్ ధర 6.24 నుండి 8.83 లక్షలుగా సంస్థ నిర్ణయించింది.