IND vs SA: ఇండియా, సౌతాఫ్రికా నాలుగో టీ20.. గంట ఆలస్యంగా టాస్.. కారణమిదే!

IND vs SA: ఇండియా, సౌతాఫ్రికా నాలుగో టీ20.. గంట ఆలస్యంగా టాస్.. కారణమిదే!

ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగనున్న నాలుగో టీ20 ఆలస్యం కానుంది. బుధవారం (డిసెంబర్ 17) లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్ లో అనుకున్న సమయానికి టాస్ పడలేదు. భారత కాలమాన ప్రకారం 6:30 గంటలకు టాస్ వేయాలి. 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే స్టేడియంలో దట్టమైన పొగ మంచు కారణంగా టాస్ ఆలస్యంగా వేయనున్నారు. దీంతో 7:30 గంటలకు టాస్ వేయనున్నారని సమాచారం. స్టేడియంలో ఉన్న పొగ మంచు ఎదురుగా ఉన్న స్టాండ్‌లలో ఉన్న ప్రేక్షకులు ఎవరూ కనిపించడం లేదని అక్కడ ఉన్న కామెంట్రీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. 

బుధవారం జరిగే ఈ పోరులో గెలిచి ఇక్కడే సిరీస్‌‌‌‌ను చేజిక్కించుకోవాలని టీమిండియా ప్రయత్నిస్తోంది. గత మ్యాచ్‌‌‌‌లో పెద్ద టార్గెట్‌‌‌‌ లేకపోవడంతో బ్యాటర్లపై పెద్దగా ఒత్తిడి కనిపించలేదు. కానీ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు మరో ఏడు మ్యాచ్‌‌‌‌లే మిగిలి ఉండటంతో టాప్‌‌‌‌ స్టార్లందరూ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. అనారోగ్యం కారణంగా అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌ ఈ సిరీస్‌‌‌‌కు దూరమయ్యాడు. అతని ప్లేస్‌‌‌‌లో షాబాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే అక్షర్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో కుల్దీప్‌‌‌‌ను కొనసాగించొచ్చు. వ్యక్తిగత కారణాలతో గత మ్యాచ్‌‌‌‌కు దూరమైన బుమ్రా నేడు బరిలోకి దిగడం ఖాయమైంది.   

మరోవైపు సిరీస్‌‌‌‌లో 1–2తో వెనకబడిన సౌతాఫ్రికా లెక్క సరిచేయాలని భావిస్తోంది. అయితే బ్యాటింగ్‌‌‌‌లో నిలకడ లేకపోవడం ప్రొటీస్‌‌‌‌ను దెబ్బతీస్తోంది. గత టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నుంచి ఇప్పటి వరకు ఆడిన 28 మ్యాచ్‌‌‌‌ల్లో సఫారీ టీమ్ 18 సార్లు ఓడటం గమనార్హం. ఒకరిద్దరు మెరుస్తున్నా సమష్టిగా విజయాలు అందుకోవడంలో సఫారీలు ఫెయిలవుతున్నారు. దాంతో వీలైనంత త్వరగా టీమ్‌‌‌‌ను సుస్థిరం చేసుకోవాలని ప్రొటీస్‌‌‌‌ లక్ష్యంగా పెట్టుకుంది.