రైళ్లలో ప్రయాణించే వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. కరోనా సమయంలో ఆపేసిన సీనియర్ సిటిజన్ టికెట్ రాయితీలను (Concessions) భారతీయ రైల్వే తిరిగి ప్రారంభించబోతోంది. దీనివల్ల లక్షలాది వృద్ధులకు ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా, రైలు ప్రయాణం మరింత సాఫి అవుతుంది.
వృద్ధులకు లభించే సౌకర్యాలు:
టికెట్ ధరలో తగ్గింపు: దూర ప్రాంతాలకు వెళ్లే వృద్ధులకు టికెట్ రేట్లలో తగ్గింపు లభిస్తుంది. తీర్థయాత్రలకు, కుటుంబ సభ్యులను చూడటానికి లేదా వైద్య చికిత్స కోసం వెళ్లే వృద్ధులకు ఇది ఆర్థికంగా పెద్ద ఊరటనిస్తుంది.
స్టేషన్లలో ఇంకా రైలు ప్రయాణం సమయంలో వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారు. నడవడానికి ఇబ్బంది పడేవారికి లేదా ఇతర అవసరాల కోసం రైల్వే సిబ్బంది ప్రత్యేక సహకారం అందిస్తారు.
ఈ రాయితీలు ఎవరికి వర్తిస్తాయి:
రైల్వే నిబంధనల ప్రకారం 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులు, 58 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు అర్హులు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు:
మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు మీ వయస్సు తెలిపే ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు అంటే ఉదాహరణకు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ లేదా పాన్ కార్డ్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. రైలులో టికెట్ కలెక్టర్ (TTE) అడిగినప్పుడు ఈ గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా పెన్షన్ మీద ఆధారపడే వారికి, మధ్యతరగతి వృద్ధులకు చాలా ప్రయోజనం కలుగుతుంది.
