రైళ్లలో లిమిట్కు మించి.. లగేజీ తీసుకెళితే డబ్బులు కట్టాల్సిందే.. ఎన్ని కేజీలు దాటితే..

రైళ్లలో లిమిట్కు మించి.. లగేజీ తీసుకెళితే డబ్బులు కట్టాల్సిందే.. ఎన్ని కేజీలు దాటితే..

ఢిల్లీ: రైళ్లలో ఇకపై పరిమితికి మించి లగేజ్ ఉంటే ఛార్జీలు చెల్లించాల్సిందేనని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్ సభలో బుధవారం ప్రకటించారు. సెకండ్ క్లాస్ లో ప్రయాణించే ప్రయాణికుడికి 35 కేజీల లగేజ్ వరకూ పూర్తి ఉచితంగా తీసుకెళ్లొచ్చని.. గరిష్టంగా 70 కేజీల వరకూ తీసుకెళ్లొచ్చని రైల్వే మంత్రి తెలిపారు. 

అయితే.. 35 కేజీల పరిమితి దాటితే లగేజ్కు ఛార్జీలు చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. స్లీపర్ క్లాస్ ప్రయాణికుడికి 40 కేజీల లగేజ్ వరకూ ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉందని.. గరిష్టంగా 80 కేజీల దాకా తీసుకెళ్లేందుకు అనుమిత ఉందని చెప్పారు. 40 కేజీల పరిమితి దాటితే ఛార్జీలు చెల్లించక తప్పదని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.

Also Read : రైళ్లలో లిమిట్కు మించి.. లగేజీ తీసుకెళితే డబ్బులు కట్టాల్సిందే.. ఎన్ని కేజీలు దాటితే..

ఏసీ 3 టైర్ లేదా చైర్ కార్ ప్రయాణం చేసే ప్రయాణికుడికి 40 కేజీల వరకూ ఉచితంగా లగేజ్ తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని.. ఇదే గరిష్ట పరిమితి అని కూడా రైల్వే మంత్రి తెలిపారు. ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్ ప్రయాణికుడు 50 కేజీల వరకూ లగేజ్ను ఉచితంగా తీసుకెళ్లొచ్చని.. గరిష్టంగా 100 కేజీల వరకూ అనుమతి ఉందని తెలిపారు. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికుడు 70 కేజీల వరకూ ఉచితంగా తీసుకెళ్లొచ్చని.. 150 కేజీల వరకూ గరిష్టంగా తీసుకెళ్లొచ్చని.. 70 కేజీలు దాటితే లగేజ్ ఛార్జ్ ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.