చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం బీజేపీ, కాంగ్రెస్ యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చండూరు టౌన్ లోని జాగిరి టీ స్టాల్ వద్ద టీ తాగేందుకు బీజేపీ కి చెందిన దోటి కిరణ్ అతని స్నేహితులు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన బెల్లం కొండ వినయ్, మొగుదాల రవి కి మధ్య ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల వివాదం తలెత్తింది.
ఈ నేపథ్యంలో తనతో పాటు నరేశ్, శివ, భీమనపల్లి గణేష్, సామరాజు, ఇడికూడ మెహన్, చెరి పల్లి వెంకన్నపై కాంగ్రెస్ నేతలు దాడి చెశారని దోటి కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.
