బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ ఇంకా ఇంటికి రాలేదు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి..!

బుక్ చేసిన గ్యాస్ సిలిండర్ ఇంకా ఇంటికి రాలేదు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి..!

గ్యాస్ సిలిండర్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా ఇంకా ఇంటికి డెలివరీ కాలేదా? డెలివరీ ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బంది పడుతున్నారా? ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ఏర్పడిన అంతర్జాతీయ చమురు సంక్షోభం ఇప్పుడు వంటింట్లోని గ్యాస్ పొయ్యి వరకు పాకింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఇంధన లభ్యత సమస్యల కారణంగా ఇండెన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ కస్టమర్లు తమ బుకింగ్ స్టేటస్ తెలుసుకోవడానికి.. కంప్లెయింట్స్ నమోదు చేయడానికి కంపెనీలు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఈ సంక్షోభ సమయంలో మీ సిలిండర్ కి సంబంధించిన అప్‌డేట్స్ ఎలా సులువుగా తెలుసుకోవాలి ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ఇరాన్‌లోని హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతింది. భారత్‌కు అందే LPG దిగుమతుల్లో సుమారు 90 శాతం ఈ మార్గం నుంచే రావాలి. రవాణా పరమైన ఇబ్బందులు, స్టాక్ తక్కువగా ఉండటంతో డీలర్లు సిలిండర్లను డెలివరీ చేయటం ఆలస్యం జరుగుతోంది. అయితే పరిస్థితి మెరుగుపడుతోందని, త్వరలోనే మరిన్ని ట్యాంకర్లు భారత్‌కు చేరుకుంటాయని అధికారులు చెబుతున్నారు.

ఇండేన్ గ్యాస్:
ఇండేన్ గ్యాస్ కస్టమర్లు తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి లేదా బుకింగ్ వివరాల కోసం 1800-2333-555 నంబర్‌కు కాల్ చేయవచ్చు. అలాగే 7718955555 నంబర్ ద్వారా బుకింగ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా సులభంగా బుక్ చేయాలనుకుంటే 75888 88824 నంబర్‌కు మెసేజ్ చేయవచ్చు లేదా 84549 55555 కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా రీఫిల్ ఆర్డర్ చేయవచ్చు.

హెచ్‌పీ గ్యాస్:
హెచ్‌పీ గ్యాస్ వాడుతున్న వారు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 1800-233-3555 కస్టమర్ కేర్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఆధునిక పద్ధతిలో గ్యాస్ బుక్ చేయాలనుకునే వారు 92222 01122 నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపి నిమిషాల్లో పని పూర్తి చేసుకోవచ్చు.

భారత్ గ్యాస్:
భారత్ గ్యాస్ కస్టమర్లు తమ గ్యాస్ కనెక్షన్ సంబంధిత ఫిర్యాదులను నమోదు చేసేందుకు 1800-22-4344 అనే స్మార్ట్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. ఆటోమేటెడ్ రీఫిల్ బుకింగ్, స్టేటస్ చెకింగ్ కోసం 7718012345 అనే ఐవీఆర్ఎస్ సౌకర్యాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది.

ప్రస్తుతం చాలా కుటుంబాలు పరిమిత గ్యాస్ స్టాక్ తో సర్దుకుపోవాల్సి వస్తోంది. డెలివరీలో ఆలస్యం జరిగితే ఆందోళన చెందకుండా.. పైన పేర్కొన్న అధికారిక నంబర్ల ద్వారా మీ డిస్ట్రిబ్యూటర్ వద్ద స్టాక్ పరిస్థితిని తెలుసుకోవడం మంచిది. సరఫరా వ్యవస్థలు మళ్లీ సాధారణ స్థితికి చేరే వరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారిక మార్గాల్లో సమస్యలను పరిష్కరించుకోవటం మంచిది.