మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీ మూలాలపై విచారణ చేయనుంది సిట్.
దుబాయి లింకులు , డ్రగ్స్ దందా , నిమిద్ శర్మ రియల్ వ్యాపారాలపై కూడా సిట్ విచారణ కొనసాగనుంది. ఈ మేరకు సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ శివధర్ రెడ్డి.
మొయినాబాద్ అజీజ్ నగర్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో గత శనివారం రాత్రి ఈగల్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోహిత్ రెడ్డి, ఏపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ సహా మొత్తం 11 మందిని నిందితులుగా చేర్చారు. పోలీసులపై కాల్పులకు యత్నించారని ఢిల్లీ రియల్టర్ నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి ఆర్మ్స్ యాక్ట్ కింద రిమాండ్ చేశారు. నమిత్ శర్మపై దాడికి వచ్చారని.. ఫైరింగ్ ఆర్డర్ మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు ముందస్తుగా సెర్చ్ వారెంట్ తీసుకున్నారు.
ఈగల్ ఫోర్స్, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్, మొయినాబాద్ పోలీసులు సహా సుమారు 40 మందికి పైగా పోలీసులు మఫ్టీలో సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఫామ్ హౌస్ గేట్లు ఓపెన్ చేయకపోవడంతో గోడలు దూకి లోపలికి వెళ్లారు. కాగా, అప్పటికే లిక్కర్, డ్రగ్స్ మత్తులో ఉన్న ఢిల్లీకి చెందిన రియల్టర్ నమితశర్మ.. ఢిల్లీలోని తన ప్రత్యర్థులే దాడికి యత్నిస్తున్నారని అనుమానించినట్టు తెలిసింది.
ఈ క్రమంలోనే రోహిత్ రెడ్డి తమ్ముడు రితేశ్ రెడ్డి దగ్గర ఉన్న రివాల్వర్ ను నమిత్ శర్మ తీసుకున్నట్టు సమాచారం. పారిపోయేందుకే తమపై కాల్పులకు యత్నించారని, రోహిత్ రెడ్డి ఇందుకు పురమాయించారని పోలీసులు చెప్తున్నారు. తాము పోలీసులమని పలుమార్లు అనౌన్స్ చేయడంతో ఫైరింగ్ ఆగిపోయిందని పేర్కొంటున్నారు.
