పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు.. మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు జడ్జిమెంట్

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు.. మెదక్ ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు జడ్జిమెంట్

మెదక్​ టౌన్, వెలుగు: విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ మెదక్​ ఫాస్ట్​ ట్రాక్​ పోక్సో కోర్టు జడ్జి ఆర్ఎం శుభవల్లి సోమవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాస్​రావు తెలిపారు. మెదక్​ జిల్లా రేగోడ్​ మండలంలోని ఓ స్కూల్​లో అటెండర్​గా పని చేస్తున్న సారా జైపాల్​ 2019లో అదే స్కూల్​లో ఓ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధించారు. బాధితురాలికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు.