బిజినేపల్లి మండలంలోని హోటళ్లలో  20 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం

బిజినేపల్లి మండలంలోని హోటళ్లలో  20 డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం

కందనూలు, వెలుగు:   నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని హోటల్స్, బేకరీలు లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి హాటళ్లలో  20 డొమెస్టిక్​  సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.  సోమవారం ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ.. బిజినపల్లి మండలంలోని మంగనూరు, పాలెం, వట్టెం,బిజినేపల్లి లలో హోటల్స్ లలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.

డొమెస్టిక్​ సిలిండర్లను కమర్షియల్​గా వాడుతున్నట్టు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిర్వహకులపై కేసులు నమోదు చేశారు.  హోటల్ యజమానులు ఇలా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.  ఈ తనిఖీల్లో రెవెన్యూ సిబ్బంది రవికుమార్, అనురాధ, జగన్నాథం, ప్రసన్న,పోలీస్  సిబ్బంది కృష్ణయ్య ,నరసింహ, రవి పాల్గొన్నారు.