టెహ్రాన్: హార్మూజ్ జలసంధి మూసివేతకు సంబంధించి ఇరాన్ కీలక ప్రకటన చేసింది. తమ దృష్టిలో జలసంధి తెరిచే ఉందని, తమపై దాడులు చేస్తున్న వారికి (దేశాలకు) మాత్రమే అది మూతపడిందని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు వారి మిత్రదేశాలకు చెందిన నౌకలను మాత్రమే తాము అడ్డుకుంటున్నామని స్పష్టం చేశారు.
హార్మూజ్ను తెరిపించేందుకు యుద్ధ నౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అరాఘ్చీ స్పందించారు. గతంలో బద్ధ శత్రువుగా భావించిన దేశాన్నే ట్రంప్ ఇప్పుడు అడుక్కుంటున్నాడని ఎద్దేవా చేశారు.
