- బీఆర్‌ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో ఏమీ లేదని, పూర్తిగా డొల్ల అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్, మల్లారెడ్డితో కలిసి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితంతో సమానం.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు గురించి ప్రస్తావన లేదు. వృద్ధులకు పెన్షన్లు పెంచలేదు. గత ప్రభుత్వం చేసినవాటిని ఈ ప్రభుత్వం చేసినట్లు అబద్ధాలు చెప్పారు’’అని విమర్శించారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు హామీ ఇచ్చి, చేయలేదన్నారు. పెన్షన్లు, రైతు బంధు, తులం బంగారం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
