IPL 2026 Mini-auction: ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు కష్టకాలం.. ఐపీఎల్‌లో అందరూ అన్ సోల్డ్.. పాకిస్థాన్ లీగ్‌లోనూ నో ఛాన్స్

IPL 2026 Mini-auction: ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు కష్టకాలం.. ఐపీఎల్‌లో అందరూ అన్ సోల్డ్.. పాకిస్థాన్ లీగ్‌లోనూ నో ఛాన్స్

ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు ఐపీఎల్ 2026 మినీ వేలంలో తీవ్ర నిరాశ ఎదురైంది. మంగళవారం (డిసెంబర్ 16) జరిగిన మినీ ఆక్షన్ లో ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు ఒక్కరు కూడా వేలంలో అమ్ముడుపోలేదు. మొత్తం ఆక్షన్ లోకి 10 మంది ప్లేయర్లు వచ్చారు. వీరిలో చాలామందికి ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఉంది. అయినప్పటికీ ఒక్కరినీ కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోవడానికి ఆసక్తి చూపించలేదు. రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫరూఖీ, గుల్బాదిన్ నాయబ్, వకార్ సలాంఖీల్, సెడిఖుల్లా అటల్, కైస్ అహ్మద్, వాహీదుల్లా జద్రాన్, అరబ్ గుల్ మోమండ్ ఈ ఈ లిస్ట్ లో ఉన్నారు.    

రహ్మానుల్లా గుర్బాజ్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫరూఖీ, గుల్బాదిన్ నాయబ్ లాంటి టాప్ ఆఫ్ఘన్ ఆటగాళ్లు వేలంలో ఖచ్చితంగా అమ్ముడుపోతారనుకుంటే ఫ్రాంచైజీలు వీరికి బిగ్ షాక్ ఇచ్చారు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, గజన్‌ఫర్, అజమాతుల్లా ఓమార్జాయి మాత్రమే 2026 ఐపీఎల్ సీజన్ ఆడనున్నారు. గుజరాత్ టైటాన్స్ తరపున రషీద్ ఖాన్.. చెన్నై సూపర్ కింగ్స్ తరపున నూర్ అహ్మద్, పంజాబ్ తరపున ఓమర్జాయ్, ముంబై తరపున గజన్‌ఫర్ ముంబై తరపున ఆడతారు. ఈ నలుగురు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు  2026 ఐపీఎల్ మినీ ఆక్షన్ ముందు రిటైన్ చేసుకున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి చేరింది. 

సాధారణంగా ఐపీఎల్ లో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడుతూ డబ్బులు సంపాదించుకుంటారు. అయితే ఇప్పుడు ఆఫ్ఘన్ క్రికెటర్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడేందుకు అనుమతి లేదు. రాజకీయ కారంలా వలన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్థాన్ వెళ్లి మ్యాచ్ లు ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రెండు నెలల క్రితం ఆఫ్ఘనిస్తాన్  దేశంలోని ఉర్గున్ జిల్లాలో జరిగిన సరిహద్దు దాడుల్లో ముగ్గురు స్థానిక క్రికెటర్లు మరణించడంతో పాకిస్తాన్‌తో మ్యాచ్ లు రద్దు చేసుకుంది. దీంతో ఓ వైపు ఐపీఎల్ లో నిరాశ మిగిలిన ఆఫ్ఘన్ ప్లేయర్లకు పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడే ఛాన్స్ లేదు. 

పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన దాడిలో పాక్టికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాకు చెందిన క్రికెటర్లు చనిపోయినందుకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ బాధాకరమైన సంఘటనకు నిరసనగా అలాగే చనిపోయినవారికి గౌరవ సూచకంగా నవంబర్ చివర్లో పాకిస్తాన్‌తో ఆడాల్సిన ట్రై సిరీస్ నుండి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పుకోవాలని నిర్ణయించింది. ఈ విచారకర సంఘటన తర్వాత పాకిస్థాన్ లో గానీ పాకిస్థాన్ పై మ్యాచ్ లు ఆడేందుకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధంగా లేదు.