IND vs SA: బుమ్రా వచ్చేశాడు.. నాలుగో టీ20లో రెండు మార్పులతో టీమిండియా

IND vs SA: బుమ్రా వచ్చేశాడు.. నాలుగో టీ20లో రెండు మార్పులతో టీమిండియా

సౌతాఫ్రికాతో జరగబోయే నాలుగో టీ20కోసం టీమిండియా సిద్ధమవుతోంది. బుధవారం (డిసెంబర్ 17) లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్ లో 2-1తో ఆధిక్యంలో నిలిచిన టీమిండియా నేడు సఫారీలతో జరగబోయే సమరంలో ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. ఈ రోజు మ్యాచ్ లో గెలిస్తే టీమిండియా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరోవైపు సౌతాఫ్రికా ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను 2-2 తో సమం చేయాలని భావిస్తోంది. సాయంత్రం 7:00 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతోంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. 

మూడో టీ20లో గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియా నాలుగో టీ20లో రెండు మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో మూడో టీ20కి దూరమైన బుమ్రా.. నాలుగో టీ20కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. హర్షిత్ రానా స్థానంలో బుమ్రా జట్టులోకి రానున్నాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్ టన్ జట్టులోకి రానున్నాడనే వార్తలు వస్తున్నాయి. అక్షర్ పటేల్ జట్టుకు దూరం కావడంతో బ్యాటింగ్ డెప్త్ కోసం సుందర్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఈ రెండు మార్పులు మినహాయిస్తే ఎలాంటి సంచలన మార్పులు చోటు చేసుకోకపోవచ్చు. 

సూర్య, గిల్ ఫామ్ లోకి రావాలి:
  
కెప్టెన్‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ ఫామ్‌‌‌‌లోకి రావాలని ఆశిస్తున్న ఇండియా.. సౌతాఫ్రికాతో నాలుగో టీ20 మ్యాచ్‌‌‌‌కు రెడీ అయ్యింది. బుధవారం జరిగే ఈ పోరులో గెలిచి ఇక్కడే సిరీస్‌‌‌‌ను చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. గత మ్యాచ్‌‌‌‌లో పెద్ద టార్గెట్‌‌‌‌ లేకపోవడంతో బ్యాటర్లపై పెద్దగా ఒత్తిడి కనిపించలేదు. కానీ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌కు మరో ఏడు మ్యాచ్‌‌‌‌లే మిగిలి ఉండటంతో టాప్‌‌‌‌ స్టార్లందరూ గాడిలో పడాల్సిన అవసరం ఉంది. ఈ సీజన్‌‌‌‌లో టీ20 ఫార్మాట్‌‌‌‌లో 15 కంటే తక్కువ సగటు నమోదు చేసిన సూర్య..  ఒక్క హాఫ్‌‌‌‌ సెంచరీ కూడా చేయలేదు.

ప్రతీ మ్యాచ్‌‌‌‌లో 20 బాల్స్‌‌‌‌ కంటే ఎక్కువగా ఆడలేకపోతున్నాడు. ఇతర ఫార్మాట్లలో రాణిస్తున్న గిల్‌‌‌‌.. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో కుదురుకోకపోవడం సెలెక్టర్లను, మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ను ఆందోళనలో పడేసింది. ఓపెనింగ్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ దూకుడు ముందు తేలిపోవడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. అభిషేక్‌‌‌‌తో మంచి జోడీ కుదిరిన శాంసన్‌‌‌‌ను తప్పించి గిల్‌‌‌‌ను ఆడించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. కనీసం ఈ మ్యాచ్‌‌‌‌లోనైనా గిల్, సూర్య గాడిలో పడతారేమో చూడాలి. 
              
సౌతాఫ్రికాతో నాలుగో టీ20కి భారత జట్టు (అంచనా):

అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దుబే, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి