టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో తన నెంబర్ వన్ ర్యాంక్ ను మరింత పదిలం చేసుకున్నాడు. ఐసీసీ లేటెస్ట్ టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బుధవారం ఐసీసీ (డిసెంబర్ 17) రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో 818 రేటింగ్ పాయింట్స్ తో ఎవరికీ అందనంత దూరంలో నిలిచాడు. రెండో ర్యాంక్ లో ఉన్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ 699 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. డఫీకి బుమ్రాకు మధ్య ఏకంగా 119 రేటింగ్ పాయింట్స్ ఉండడంతో వరుణ్ చక్రవర్తి నెంబర్ ర్యాంక్ మరికొన్ని నెలలపాటు సేఫ్ గా ఉండడం ఖాయంగా మారింది.
అగ్రస్థానంతో పాటు మరో చారిత్రాత్మక ఘనతను వరుణ్ సొంతం చేసుకున్నాడు. ఒక ఇండియన్ బౌలర్ గా అత్యధిక టీ20 రేటింగ్ పాయింట్లు సాధించిన బౌలర్ గా నిలిచాడు. ఇండియా తరపున 783 రేటింగ్ పాయింట్లతో టాప్ లో ఉన్న బుమ్రాను వెనక్కి నెట్టి 818 పాయింట్లకు చేరుకున్నాడు. టీ20 ఫార్మాట్ లో 800 రేటింగ్ పాయింట్లు అందుకున్న తొలి భారత బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఈ తమిళనాడు స్పిన్నర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఆడిన మూడు టీ20 మ్యాచ్ ల్లో పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
వరుణ్ చక్రవర్తి మినహాయిస్తే టాప్-10 లో ఇండియన్ బౌలర్ లేడు. ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్.. శ్రీలంక స్పిన్నర్ వానిందు హసరంగా వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో
అద్భుతంగా బౌలింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ ఆశ్చర్యకరంగా నాలుగు స్థానాలు దిగజారి 12 నుంచి 16 ర్యాంక్ కు పడిపోయాడు. అక్షర్ పటేల్ 13 ర్యాంక్ లో ఉన్నాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 39 నుంచి 25 ర్యాంక్ కు చేరుకున్నాడు.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ (టాప్ 10 బౌలర్లు)
వరుణ్ చక్రవర్తి (818)
జాకబ్ డఫీ (699)
రషీద్ ఖాన్ (694)
అబ్రార్ అహ్మద్ (691)
వానిండు హసరంగా (687)
ఆదిల్ రషీద్ (686)
అకేల్ హోసేన్ (675)
ముస్తాఫిజుర్ రెహమాన్ (665)
నాథన్ ఎల్లిస్ (660)
ఆడమ్ జంపా (655)
🚨VARUN CHAKRAVARTHY CREATES HISTORY🚨
— CricInformer (@CricInformer) December 17, 2025
Becomes the highest-rated Indian bowler in T20I
history with 818 points! 🤯🇮🇳#varunchakravarthy #CricketNews #teamindia #INDvSA #icc pic.twitter.com/1REcCEN6s2
