ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎలాంటి పవర్ హిట్టర్ లు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ జట్టుకు బ్యాటింగే బలం. బౌలింగ్ లో అంత బలంగా కనిపించకపోయినా బ్యాటింగ్ లో మాత్రం దుమ్ములేపుతారు. చివరి రెండు సీజన్ లో బ్యాటర్లు ఎంత విధ్వంసం సృష్టించారో అందరికీ తెలిసిన విషయమే. దుర్బేధ్యమైన బ్యాటింగ్ తో ప్రత్యర్థులను దడ పుట్టించిన సన్ రైజర్స్ జట్టులో మరో పవర్ హిట్టర్ చేరాడు. ఇంగ్లాండ్ విధ్వంసకర వీరుడు లియామ్ లివింగ్ స్టోన్ సన్ రైజర్స్ జట్టులో చేరడంతో కమ్మిన్స్ సేన మరింత పటిష్టంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ లో లివింగ్‌స్టోన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.13 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేశారు. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబి వేదికగా జరుగుతున్న మినీ వేలంలో మొదట అన్ సోల్డ్ గా మిగిలిపోయిన ఈ ఇంగ్లాండ్ వీరుడు.. చివర్లో భారీ ధరకు అమ్ముడుపోయాడు. దీంతో ఇప్పుడు సన్ రైజర్స్ ఫ్యాన్స్ తమ జట్టు ప్లేయింగ్ 11 ప్రకటిస్తున్నారు. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఉన్నారు. హెడ్, అభిషేక్ 2026 ఐపీఎల్ లో మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ జోడీ. మూడో స్థానంలో సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ చేయనున్నాడు. టీమిండియా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు.
క్లాసన్, లివింగ్ స్టోన్ రూపంలో మిడిల్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. గత సీజన్ లో సత్తా చాటిన అనికేత్ వర్మ ఏడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, పాట్ కమ్మిన్స్ ఫాస్ట్ బౌలర్లుగా ఉండడం ఖాయం. ఏకైక స్పిన్నర్ గా జీషాన్ అన్సారీ జట్టులో ఉంటాడు. ఫాస్ట్ బౌలర్ శివమ్ మావి ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు సీజన్ లలో బ్యాటింగ్ లో పరుగుల వరద పారించిన హైదరాబాద్ జట్టుకు లివింగ్ స్టోన్ చేరడంతో ఈ సారి తమ జట్టు 350 పైగా కొడుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. జట్టులో టాప్-6 బ్యాటర్లు అందరూ కూడా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వారే కావడం విశేషం.
ఐపీఎల్ 2026 సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు:
లియామ్ లివింగ్‌స్టోన్: రూ. 13 కోట్లు
జాక్ ఎడ్వర్డ్స్: రూ.3 కోట్లు
సలీల్ అరోరా: రూ.1.50 కోట్లు
శివం మావి: రూ.75 లక్షలు
శివాంగ్ కుమార్: రూ.30 లక్షలు
షకీబ్ హుస్సేన్: రూ.30 లక్షలు
ఓంకార్ తుకారాం తర్మలే: రూ.30 లక్షలు
అమిత్ కుమార్: రూ.30 లక్షలు
ప్రఫుల్ హింజ్: రూ.30 లక్షలు
క్రెయిన్స్ ఫులేట్రా: రూ.30 లక్షలు
పాట్ కమ్మిన్స్ (కెప్టెన్
ట్రావిస్ హెడ్
అభిషేక్ శర్మ
అనికేత్ వర్మ
ఆర్. స్మరన్
ఇషాన్ కిషన్
హెన్రిచ్ క్లాసెన్
నితీష్ కుమార్ రెడ్డి
హర్ష్ దుబే
కమిండు మెండిస్
హర్షల్ పటేల్
బ్రైడాన్ కార్స్
జయదేవ్ ఉనద్కట్
ఎషాన్ మలింగ
జీషన్ అన్సారీ
